జమ్మూకాశ్మీర్ ప్రజా ప్రతినిధులలకు 25 లక్షల భీమా

జమ్మూకాశ్మీరులోని ప్రజాప్రతినిధులకు 25లక్షల రూపాయలు భీమా సౌకర్యం కల్పిస్తూ శనివారం నాడు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ నిర్ణయం తీసుకుంది.

ఈ ఉత్తర్వులు మేరకు సర్పంచ్, బిడిసి చైర్మన్లు, మున్సిపల్ పాలకవర్గం, జమ్మూకాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో
పరిధిలోని స్ధానిక సంస్థలు ఎన్నికల్లో గెలుపొందిన ప్రతి ఒక్కరికి సాధారణ, ప్రమాద, తీవ్రవాదుల చేతిలో మృతి చెందిన వారికి 25లక్షల రూపాయలు భీమా సౌకర్యం కల్పిస్తూ పరిపాలన కౌన్సిల్ శనివారం ఉత్తర్వులు జారీచేసింది.

జమ్మూకాశ్మీరులో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదులు హతమార్చడంపై దృష్టిలో పెట్టుకుని భీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం.