ఒక మేక ఖరీదు 8లక్షలు
బక్రీద్ సందర్భంగా ఒక మేక 8లక్షల రూపాయలకు ఖరీదు చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే అల్లాహ్ అనే పేరుతో ఉర్దూ లిపిలో ఉన్న అక్షరాలు ఒక మేకపై ఉండడంతో దాని యజమాని “”అల్లాహ్ పేరు పైన ఉన్న మేక”” 8లక్షలకు విక్రయించడం జరుగుతుందని యజమాని ఒక ప్రకటనలో తెలిపారు.
యజమాని మాటలలో బకర్ ఈద్ సందర్భంగా మార్కెట్ కు తరలించే మేకలాలో ఇది ఎంతో అరుదైన మేక అని దానిపై అల్లాహ్ అనే పేరు ఉండడంతో దాని ధరను నిర్ణయం చేసినట్లు తెలిపారు. అలాగే ఈ మేకకు ప్రతి రోజు 800ఖర్చు చేయడం జరుగుతుందని ఇది సాధారణ మేకలకంటే బరువు ఎక్కువగా 95కిలోలు ఉండడం విశేషంగా మేక యజమాని మొహమ్మద్ నిజాముద్దీన్ తెలిపారు.