ఆ పాద ముద్రలు హనుమంతునివేనా?… వైరల్ అవుతున్న వీడియో సారాంశం ఏమిటి?
ఇండియన్ ఆర్మీ అఫీషియల్ గా విడుదల చేసిన ఫోటోలు….
నెటిజన్ల వీడియోలు వీడియోలు ఇప్పుడు వైరల్ అవ్వడానికి కారణం ఏమిటి?
ఇండియన్ ఆర్మీ ప్రస్తుతం భారత సరిహద్దుల్లో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తమ విధి నిర్వహణలో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో హిమాలయాల్లో ఒక 32ఇంచుల పొడవు 15ఇంచుల వెడల్పు కలిగిన అరుదైన పాదముద్రలు కనిపెట్టిన భారతసైన్యం ప్రస్తుతం ఇవి ఎలా వచ్చాయి అనే అంశంపై అరా తీయడంలో బిజీ అయిపోయింది.
దైవికంగా హిందు ఇతిహాసాల ప్రకారం హనుమంతుడు హిమాలయాల్లో సజీవంగా ఉన్నాడనే నమ్ముతారు హిందుత్వవాదులు. అయితే ప్రస్తుతం కనిపించిన పాదముద్రలు మనిషివి అయితే కాదని అంటున్నాయి ఆర్మీ వర్గాలు. అయితే ఈ విషయాన్ని సవాల్ చేస్తూ నెటిజన్లు చేస్తున్న వీడియోలకు తమ మేధోశెక్తిని జోడించి తమదైన శైలిలో వీడియోలు రూపొందిస్తున్నారు.
విషయానికి వస్తే హిందూ శాస్త్రాల ప్రకారం హనుమంతుడు హిమాలయాల్లో సజీవంగా ఉన్నాడనే విషయాన్ని తీసిపోకుండా అణువణువునా ప్రత్యేకబలగాలతో మోహరించే ఇండియన్ ఆర్మీ తమను దాటి వచ్చిన అదృశ్యశక్తిని కనిపెట్టే పనిలో ఉన్నారు.
అయితే ఆ పాదముద్రలకు ఎతి అనే పేరును పెట్టారు కానీ…. ఇంత భీకరంగా పాదముద్రలు ఉండడంతో నిజంగానే తమ సైన్యాన్ని దాటి వచ్చింది హనుమంతుడే అని నమ్మడానికి ఇతిహాస మరియు ప్రస్తుత వైరల్ అవుతున్న వీడియోలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
ఏది ఏమైనా అంతా మంచు పర్వతం కాబట్టి ఇక్కడికి అరుదైన జీవులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఈ విషయం కనుగొనే వరకు పాఠకులు వేచి చూడాల్సిఉంది.