పాక్ దళాలకు చిక్కిన మన పైలట్ “అభినందన్” కుటుంబ నేపధ్యం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
27 ఫిబ్రవరి 2019 బుధవారంనాడు దేశ రక్షణా చర్యలలో భాగంగా మిగ్ 21 బైసన్ విమానంతో పాక్ భూభాగంలోకి వెళ్లిన అనంతరం అనుకోని విధంగా పాక్ సైన్యానికి చిక్కిన మన వాయుసేన వింగ్ కమాండర్ “అభినందన్” కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం………
అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపనూరు. అభినందన్ తండ్రి కూడా ఎయిర్ మార్షల్ అంటే మన ఆర్మీలో లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో పనిచేస్తూ రిటైర్ అయ్యారు. చెన్నైలోని తాంబరంలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆయన కుటుంబం నివాసం ఉంటున్నారు. ఉడుమలైపేట సైనిక్ స్కూల్ నందు విద్య అభ్యసించారు. ఆయన భార్య తన్వీ మెర్వాహ కూడా భారత వాయుసేనలో పనిచేస్తూ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా….. భార్య తన్వీ మెహర్వాకు హెలికాప్టర్ నడపడంలో 10ఏళ్లు మరియు 1600గంటలు హెలికాప్టర్ నడిపిన అనుభవం కూడా ఉంది.
అయితే పాక్ దళాలకు చిక్కిన మన వాయుసేన కమాండర్ అభినందన్ త్వరగా సురక్షితంగా తిరిగి రావాలని భారత ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు.