నిబంధనలకు విరుద్ధంగా భారత్ లోకి ప్రవేశించిన కార్గో…. అప్రమత్తమైన ఐఏఎఫ్ వెబడించి దించివేత

నిబంధనలకు విరుద్ధంగా భారత గగనతలంలోకి ప్రవేశించిన జార్జియా కార్గో విమానాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జైపూర్ వరకు వెంబడించి దించేసింది.

ఆంటనోవా ఏఎన్-12 అని పిలిచే భారీ కార్గో విమానం అనుమతి లేకుండా కరాచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా.. జైపూర్ విమానాశ్రయంలో దించేశారు. ఈ విమానం గుజరాత్‌లో భారత గగనతలంలోకి ప్రవేశించగా వెంటనే అప్రమత్తమైన ఐఏఎఫ్ 2 సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్లతో వెంబడించి ఆపివేసింది…. కాగా శుక్రవారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో ఈ విమానం భారత గగనతలంలో ప్రవేశించిందని ఎయిర్‌పోర్స్ తెలిపింది.

ఏటీఎస్ అనుమతించిన మార్గాన్ని కార్గో విమానం అనుసరించకుండా భారత అధికారులు రేడియో కాల్స్ చేసినా స్పందించకపోవడంతో ఎయిర్‌ఫోర్స్ రంగంలోకి దిగి వెంటనే కార్గోను ల్యాండ్ చేయాలని హెచ్చరికలు చేయగా కార్గో విమాన సిబ్బంది ల్యాండ్ చేశారు. జార్జియా రాజధాని ట్బైలీసీ నుంచి కరాచీ మీదుగా ఢిల్లీ వెళ్తున్నామని వారు తెలిపారు.

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ వాయు మార్గాన్ని మూసేశారు. ప్రస్తుతం జైపూర్ నందు కార్గో విమాన సిబ్బందిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.