మాజీ రాష్ట్రపతికి భారతరత్న…..
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దేశంలోనే అత్యున్నత పురస్కారం లభించింది.
కాంగ్రెస్ కురవృద్ధుడిగా పేరు పొందిన ప్రణబ్ ముఖర్జీ.. తన రాజకీయ జీవితంలో ఎంతో కీర్తి ప్రఖ్యాతలను సంపాందించారు. మృదు స్వభావిగా పేరొందిన ప్రణబ్ పార్టీలకు అతీతంగా అందరి మన్నలను పొంది దేశ ఆర్థిక మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. 2012 నుంచి 2017 మధ్య కాలంలో ఆయన భారత రాష్ట్రపతిగా సేవలందించిన ఈయనకు 2019 జనవరి 25న భారతరత్న అవార్డును కేంద్రం ప్రకటించింది. ఆయనతో పాటుగా మాజీ రాజ్యసభ సభ్యుడు నానాజీ దేశ్ముఖ్, ప్రముఖ సంగీత విద్వాంసుడు భూపేన్ హజారికాలకు మరణానంతరం భారతరత్న పురస్కారాన్ని 2019 జనవరి 25న కేంద్రం ప్రకటించింది.