ఆర్జేడీ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర
కేంద్ర ప్రభుత్వం పెంచిన ఇంధన ధరలను నిరసిస్తూ రాష్ట్రీయ జనతా దళ్ ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహించారు.
రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ వ్యవస్ధాపకులు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు శాసనసభ ప్రతిపక్ష నాయకుడు తేజశ్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ ల నాయకత్వంలో తన మద్దతుదారులతో పాట్నాలో సైకిల్ యాత్ర నిర్వహించారు.
నేడు రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ 22వ వ్యవస్ధపాక దినోత్సవం కావడంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.