ఉప ఎన్నికల్లో బిజెపి 4, ఆర్జేడీ 1 టిఆర్ఎస్ 1 శివసేన 1 విజయం

ఉప ఎన్నికల్లో బిజెపి 4, ఆర్జేడీ 1 టిఆర్ఎస్ 1 శివసేన 1 విజయం

దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు స్ధానల్లో రాష్ట్రీయ జనతాదళ్ ఒక స్ధానం శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) తెలంగాణ రాష్ట్ర సమితి ఒక స్ధానం గెలుచుకున్నాయి.

బీహార్ లో 2 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు

గోపాల్ గంజ్ శాసన సభ జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కుసుమ దేవి సమీప రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి మోహన్ ప్రసాద్ గుప్తా పై 1794 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఇక్కడ ఎఐఎంఐఎం అభ్యర్థి అబ్దుల్ సలాం కు 12212 ఓట్లు సాధించటంతో రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో ఓటమి చవిచూసారు.

మోక్మ శాసనసభ నియోజకవర్గం జరిగిన ఉపఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి నీలిమ దేవి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సోనమ్ దేవి పై 16707 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

హర్యానా ఒక స్థానం కు ఉప ఎన్నిక

ఆదాంపూర్ శాసనసభకు జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భవ్య బిష్ణోయ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జై ప్రకాశ్ పై 15714 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

మహారాష్ట్ర లో ఒక స్థానం కు ఉప ఎన్నిక

ముంబై లోని అంధేరి తూర్పు నియోజకవర్గ జరిగిన ఉపఎన్నికల్లో శివసేన (ఉద్ధవ్ ఠాక్రే)రుతుజా రమేష్ లట్కే సుమారు 65 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.

ఈ స్థానంలో భారతీయ జనతా పార్టీ చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకోవటం మరియు ప్రధాన రాజకీయ పార్టీలు పోటీలో లేకపోవడంతో సునాయాసంగా విజయం సాధించారు.

ఒరిస్సా లో ఒక స్థానం కు ఉప ఎన్నిక

ధామ్‌నగర్ శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సూర్యబంషీ సూరజ్ తన సమీప ప్రత్యర్థి బీజు జనతాదళ్ అభ్యర్థి అబంతి దాస్ పై 9881 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ఉత్తర ప్రదేశ్ ఒక స్థానం కు ఉప ఎన్నిక

గోల గోకరనాథ్ శాసనసభ నియోజకవర్గం జరిగిన ఉపఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అమన్ గిరి తన సమీప ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి వినయ్ తివారీ 34298 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

తెలంగాణ లో ఒక స్థానం కు ఉప ఎన్నిక

మునుగోడు శాసనసభ నియోజకవర్గంకు జరిగిన ఉపఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై 10113 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.


టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి – 96598

బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి -86485

కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి 23864

బియస్పీ అభ్యర్థి శంకరాచారి 4145

యస్పీయస్ అభ్యర్థి శ్రీశైలం యాదవ్ 2407 ఓట్ల