ఉరికి వేలాడుతున్న బెంగాల్ బిజెపి శాసనసభ్యుడిది హత్యా లేక ఆత్మహత్య

పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఊరికి వేలాడుతూ విగతజీవి కనిపించడం రాజకీయ దూమారం రేపుతుంది.

పశ్చిమ బెంగాల్ హేమతాబాద్ శాసనసభ్యులు దేబేంద్రనాథ్ రాయ్ తమ గ్రామ సమీప గ్రామమైన బిందాల్ గ్రామంలో సోమవారం ఉదయం ఉరి వేసుకుని ఉన్నట్లు గుర్తించారు. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు దేబేంద్రనాథ్ రాయ్ ని హత్యచేసిన తరువాత ఉరి తీసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్ బిజెపి కార్యకర్తలు మరియు స్ధానికులు ముమ్మాటికీ ఇది హత్యే అంటూ ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించగా…… పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయ్ గంజ్ వైద్యశాలకు తరలించారు.


తృణమూల్ కాంగ్రెస్ ప్రమేయంతో హత్య జరిగిందని సిబిఐతో దర్యాప్తు చేయించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని డిమాండ్ చేశారు.