కేంద్ర గృహ మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్
కేంద్ర గృహ మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తనకు కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని, ఫలితం పాజిటివ్ వచ్చిందని ఆయన ట్వీట్లో తెలిపారు. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మరియు గత కొద్ది రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్న వారు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండి, కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని కోరారు.
భారత గృహ మంత్రి అమిత్ షా త్వరగా కొలుకొని దేశానికి సేవలు అందించాలని జనసేన పార్టీ అధినేత పవన్ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు