రాజ్యాధికారంలో ఎంబిసిల వాటా కోసం పోరాటం చేయాలి: ఎంబిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆకుమళ్ళ నాని

రాజ్యాధికారంలో ఎంబిసిల వాటా కోసం పోరాటం చేయాలని అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆకుమళ్ళ నాని పిలుపునిచ్చారు.

వివరాల్లోకి వెళితే ఆదివారంనాడు పట్టణంలోని విశ్వనాథపురం స్థానిక బి యల్ యన్ గ్రాండ్ ఇన్ హోటల్ నందు ఎంబిసి సంఘం జిల్లా నాయకులు చెట్లూరి బాదుల్లా అధ్యక్షతనతో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు ఆకుమళ్ళ నాని మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలమైన ఉద్యమాన్ని నిర్మించి రాజ్యాధికారంలో వాటా కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శాసనమండలి సభ్యులు ఎంపికలో ఎంబిసిలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు షేక్ సలీం, షేక్ భాషా, ఎంబిసి సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ బాదుల్లా, శాతరసపల్లి చంద్రశేఖర్, బాదుల్లా, మండల నాయకులు షేక్ రాములేటి మస్తాన్ , షేక్ షేహిద్ , మురళి తదితరులు పాల్గొన్నారు.