జనం టివి యాజమాన్యాన్ని మతం మారాలంటూ ఐసిస్ హెచ్చరిక

కేరళలోని టాప్ 5లో జనం టివి ఛానల్ కు ఇస్లాం మతంలోకి మారాలంటూ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ మరియు సిరియా ఆదివారం నాడు హెచ్చరించింది.

జనం టివి కార్యాలయం సిబ్బంది మరియు యాజమాన్యం ఇస్లాం మతంలోకి మారాలని లేకపోతే కార్యాలయాలను ధ్వంసం చేసి సిబ్బందిని చంపేస్తామని ఐసిస్ బెదిరింపులకు పాల్పడింది.

ముజాహిదీన్ సందేశం ఇస్లాం మతంలోకి మిమ్మల్ని మారమని మేము ఆహ్వానిస్తున్నాము. ఒక వేళ మీరు మారకపోతే ప్రపంచానికి వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉండండి మరియు అల్లహ్ యొక్క కోపాన్ని మరియు శిక్షను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని జనం టివిని హెచ్చరించింది.

ఐసిస్ బెదిరింపులు నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలో దిగి విచారణ చేపట్టింది.