అభినందన్ ను రేపు విడుదల చేస్తాం : పాక్ ప్రధాని ఇమ్రాన్
భారత వాయుసేన వింగ్ కామాండర్ అభినందన్ ను రేపు విడుదల చేయనున్నట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురువారం పార్లమెంట్లో మాట్లాడుతూ వెల్లడించారు. జెనివా ఒప్పందాల నేపథ్యంలో గురువారం నాడు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.