ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరిన ర్యాపిడ్ కిట్లు
ఆంధ్రప్రదేశ్ కు దక్షిణ కొరియా సియోల్ నుంచి ప్రత్యేక చార్టర్ విమానం ద్వారా ఈ కిట్లు రాష్ట్రానికి శుక్రవారం నాడు ఉదయం చేరుకున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో వీటిని లాంఛనంగా ప్రారంభించారు ఈ కిట్ల ద్వారా పది నిముషాలలోనే కరోనా పాజిటివ్ లేదా నెగటివ్ అన్న విషయం తేలిపోతుందిని వీటిని కమ్యూనిటీ టెస్టింగ్ కోసం వినియోగించనున్నట్లు వీటిని తక్షణమే అన్ని జిల్లాలకూ పంపిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్ తదితరులు పాల్గొన్నారు.