అఖిలపక్ష సమావేశానికి పిలుపు లేకపోవడంతో నిరసన వ్యక్తం చేసిన ఆర్జేడీ
గాల్వన్ లోయలోని భారత్ – టిబెట్ సరిహద్దు ప్రాంతంలో భారత్ – చైనా సైనికుల మధ్య ఘర్షణలో భారత్ కు చెందిన 20మంది సైనికులు వీర మరణానంతరం ప్రధానమంత్రి నాయకత్వంలో శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి
రాష్ట్రియ జనతదళ్ పార్టీని ఆహ్వానించక పోవటంతో పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద రాష్ట్రీయ జనతదళ్ కు చెందిన పార్లమెంటు సభ్యులు లాలూ కుమార్తె మీసా భారతి , మనోజ్ ఝా నాయకత్వంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మీసా భారతి మాట్లాడుతూ దేశం క్లిష్టమైన సమయంలో ఉన్నప్పుడు నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో మా పార్టీని ఆహ్వానించకపోవడంతో కలత చెందామని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.