పూరి జగన్నాథ్ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరణ

భారత్ లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన పూరి జగన్నాధ్ రథయాత్రకు భారత సర్వోన్నత న్యాయస్థానం అనుమతిని నిరాకరించింది.

ఈ నెల 23వతేది నుండి జరిగే రథయాత్ర అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో దేవస్థానం బోర్డు వేసిన వ్యాజ్యంపై గురువారంనాడు విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్య దృష్టిలో పెట్టుకుని రథయాత్ర నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసి తదుపరి విచారణను నాలుగు వారాలకు కేసును వాయిదా వేసింది.