పూరి జగన్నాథ్ రథయాత్రకు షరతులతో సుప్రీంకోర్టు అనుమతి
భారత్ లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకైన పూరి జగన్నాధ్ రథయాత్రకు భారత సర్వోన్నత న్యాయస్థానం షరతులతో అనుమతిని మంజూరు చేసింది.
ఈ నెల 23వతేది నుండి జరిగే రథయాత్ర అనుమతి ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో దేవస్థానం బోర్డు వేసిన వ్యాజ్యంపై సోమవారంనాడు విచారణ చేపట్టిన ధర్మాసనం కొన్ని ఆంక్షలతో అనుమతిని మంజూరు చేసింది.
వేలాది సంవత్సరాల నుండి జరుగుతున్న జగన్నాథ్ రథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతి నిరాకరించడంతో ఆందోళన చెందిన భక్తులు కోర్టుతీర్పుకు వ్యతిరేకంగా అయినా సరే రథయాత్ర సాగించాలనే తలంపుతో ఉన్న భక్తులు ఈ తీర్పుతో హర్షం వ్యక్తం చేశారు.