ఉగ్ర స్థావరాలపై పంజా విసిరిన భారత్…. పుల్వామా దాడికి ప్రతీకారంగా “సర్జికల్ స్ట్రైక్ – 2″…… 400మంది ఉగ్రవాదుల హతం
పుల్వామా ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని కలచివేసిన ఘటన…. 43మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న ఆ ఘటన జవాన్ల కుటుంబాలలోనే కాకుండా దేశ ప్రజలను కూడా కంటతడి పెట్టించింది. ఉగ్రమూకలపై అటు భారత రక్షకదళాలు ఇటు ప్రభుత్వాలు, ప్రజలు ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్న తరుణంలో అందరూ ప్రధాని నరేంద్రమోడీ వైపే దృష్టి సారించారు.
2016 సెప్టెంబర్29 సర్జికల్ స్ట్రైక్ తో పాక్ ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించిన మోడీ…… ప్రస్తుత పరిణామాలలో ఏం చేస్తారు ?…. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే ప్రశ్నలకు 2019 ఫిబ్రవరి 26న “సర్జికల్ స్ట్రైక్ -2″తో జవాబు వచ్చింది. భారత రక్షకదళాలకు ప్రధాని మోడీ సర్జికల్ స్ట్రైక్ కు అదేశాలివ్వడంతో వైమానికదళం ఉదయాన్నే పాక్ ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది.
24నిమిషాల సమయం పాటు జరిగిన ఈ ఆపరేషన్ లో సామాన్య ప్రజలకు, ప్రజా ఆస్తులకు ఎలాంటి హాని కలగకుండా…… ఉగ్రస్థావరాలే లక్ష్యంగా తెల్లవారుజామున 3:30గంటలకు విరేజ్ – 2000 మోడల్ 12 ఫైటర్ జెట్లను ఉపయోగించి 1000కిలోల బాంబులను వదలడంతో ఉగ్ర స్థావరాలు నేలమట్టం అయ్యాయి. ఉగ్రవాదులు వైమానికదళాల దాడిని తిప్పికొట్టాలని ప్రయత్నం చేశారు కానీ భారత వైమానికదళ భీకర దాడులను తట్టుకోలేక హతమవ్వక తప్పలేదు.
3:45 నుండి 3:53 వరకు బాలకోట్…… 3:48నుండి 3:55వరకు ముజాఫర్ బాద్….. 3:58 నుండి4:04 వరకు చకోటి…. ప్రాంతాలలోని ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించి 400మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు.