అయోధ్యకు ఉగ్రవాదులు ముప్పు…. నిఘా విభాగాల హెచ్చరిక
ఆగస్టు 5వ తేదీన అయ్యోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే ముప్పు పొంచి ఉందనే భారత నిఘా వర్గాలు హెచ్చరికలతో భారత్ బలగాలు పెద్ద ఎత్తున ముందు జగ్రత్త చర్యలు చేపట్టాయి.
ఆప్ఘనిస్థాన్‌లో శిక్షణ పొందిన పాకిస్తాన్ ప్రెరేపిత ఉగ్రవాదులు గత మే లో దాడులు జరపడంలో విఫలం కావడంతో ఆగస్టు 5న దేశంలోని పలు ప్రాంతాల్లో దాడులకు ప్రణాళికలు చేస్తున్నట్టు నిఘా వర్గాల సమాచారం.
ఆగస్టు 5న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కూడా భూమిపూజ జరుగనుండడంతో దాడుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది.
నిఘా వర్గాల తాజా సమాచారం ప్రకారం, ఉగ్రవాదులు ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం వేడుకలను కూడా లక్ష్యంగా చేసుకున్నారనే నిఘా వర్గాలు తాజా సమాచారంతో అయోధ్య, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లో పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు.