అత్యున్నత సంస్కరణ…. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం
65సంవత్సరాలు దాటిన వారికి పోస్టల్ బ్యాలెట్
ప్రజా ఆరోగ్యం దృష్ట్యా భారత ఎన్నికల కమిషన్ కీలక ప్రకటన
ఇకపై జరగబోయే ఎన్నికలలో 65సంవత్సరాల పైబడిన వారు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించి ఓటు హక్కును వినియోగించుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ గురువారంనాడు ఒక ప్రకటన విడుదల చేసినట్లు ఎయన్ఐ వార్తా సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
65సంవత్సరాల వయసు పైబడిన వారు, మధుమేహం, రక్తపోటు సంబంధిత వ్యాధులు ఉన్న వారికి కొవిడ్-19 తదితర వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉండడంతో భారత ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం కోవిడ్ వైరస్ విజృంభణ దృష్ట్యా వృద్ధులు బయటకొచ్చేందుకు అనుమతి ఇవ్వకూడదని వైద్యవర్గాలు స్పష్టం చేస్తూ మధుమేహ,రక్తపోటు రోగస్తులు
గర్భిణులు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్న నేపథ్యంలో అలాంటి వారికి పోస్టల్ బ్యాలెట్ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
గతంలో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం 80ఏళ్లకు పైబడినవారికి….. ఇతర రాష్ట్రాల్లో అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు….. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి మాత్రమే ఉండగా….. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ 2020సంస్కరణతో 80నుంచి 65ఏళ్లకు కుదించారు.
నవంబర్ లో బీహార్ శాసనసభ స్థానాలకు జరిగే ఎన్నికల నుండి ఈ సంస్కరణ అమలు జరగడం విశేషం.