టీఆర్ఎస్ గూటికి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు?
టీఆర్ఎస్ గూటికి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్లో చేరుతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ మేరకు సండ్ర, మెచ్చా నాగేశ్వరరావు అనుచరులతో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 26 తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర వెంకటవీరయ్య, అశ్వరావుపేట నియోజకవర్గంలో మచ్చా నాగేశ్వరరావు టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే.