కందుల కుంభకోణం లో వ్యక్తి అరెస్టు

పొదిలి సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని మర్రిపుడి మండలం ధర్మవరం గ్రామం చెందిన నేరళ్ళ బ్రహ్మయ్య రైతులను నమ్మించి మోసం చేసిన సంఘటన పై వ్యక్తి ని గురువారం అరెస్టు చేసినట్లు పొదిలి పోలీస్ సర్కిల్ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొదిలి సిఐ శ్రీనివాసరావు తెలిపారు . వివరాలు లోకి వెళితే ధర్మవరం గ్రామంలో 66 మంది రైతుల వద్ద నుండి 741.5 క్వింటల్ 66 లక్షల 73 వేల 500 వేల రూపాయల విలువ చేసే కందులను
ఎక్కవ రేటు ఆశ చూపి రైతుల నుండి పొగు చేసి సంతనుతలపాడు గ్రామం లోని గాయత్రీ కోల్డ్ సోర్టిజ్ తన పేరు మీదా పెట్టుకొని ఊరు నుండి రెండు నెలలు నుండి కనపడకుండా వెళ్ళి పోవడంతో అనుమానం వచ్చిన రైతులు పోలీసులు కు పిర్యాదు ఇచ్చారు దానితో పోలీసులు కేసు నామోదు చేసి ఆ వ్యక్తి అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు ఈ విలేకరులతో సమావేశం మర్రిపుడి యస్ఐ శ్రీహరి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.