ఘనంగా 102వరోజు ఇంటింటికి వాసవి కార్యక్రమం
ఇంటింటికి వాసవిమాత కార్యక్రమం వాసవి క్లబ్స్ మరియు ఇంటింటికి వాసవి సేవాబృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే ఇంటింటికి వాసవి కార్యక్రమంలో భాగంగా 102వరోజు స్థానిక అమ్మవారిశాల వీధిలోని కొత్త రాఘవ నివాస గృహంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ అందరికి అమ్మవారికి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని….. ఇంటింటికి వాసవి కార్యక్రమం కోసం కంభం నుండి అమ్మవారిని తీసుకుని వచ్చి ప్రతి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని….. ఈ కార్యక్రమంలో భాగంగానే 102గోత్రాలు కలిగిన ఆర్యవైశ్య సామాజికవర్గంలో 102వరోజు పూజ విశిష్టత కలిగినదని ఇంటింటికి వాసవి కార్యక్రమం ప్రారంభించిన తరువాత అందరికి శుభాలు జరుగుతున్నాయని అందరూ సుఖసంతోషాలతో ఉన్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న ఇంటింటికి వాసవి సేవాబృందం మరియు వాసవి క్లబ్స్ పొదిలి వారికి ధన్యవాదాలు తెలిపారు.