108 వాహనంలో కాన్పు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

కొనకనమిట్ల మండలం అంబపురం గ్రామం నుంచి ఒక గర్భిణి కాన్పు సందర్భంగా అత్యవసర పరిస్థితుల్లో 108 వాహనంలో పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించే క్రమంలో నెప్పులు రావటంతో 108 వాహనంలో అత్యవసర వైద్య కార్యకర్త శ్రావణి ప్రసవం చేయించగా మగ బిడ్డ జన్మించారు

తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు 108 వాహనం సిబ్బంది తెలిపారు.

ఈ సందర్భంగా 108 వాహన పైలట్ శ్రీనివాస్, అత్యవసర ఆరోగ్య కార్యకర్త శ్రావణిలను పలువురు అభినందించారు