ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన 108 ,104సిబ్బంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి 108,104 ఉద్యోగ సిబ్బంది పాలాభిషేకం చేశారు.
వివరాల్లోకి వెళితే శుక్రవారంనాడు స్ధానిక పోలీస్ స్టేషన్ పక్కనే గల 108 వాహనాలు నిలుపు ప్రదేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటం ఏర్పాటు చేసి పాలభిషేకం చేసిన అనంతరం వారు మాట్లాడుతూ 104, 108సిబ్బందికి ఉద్యోగ భద్రత హామీ నెరవేర్చి జీతం పెంచడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కల్లం సుబ్బారెడ్డి, జి శ్రీనువాసులు, గొలమారి చెన్నారెడ్డి, షేక్ మహుబుబ్ భాష, యక్కలి శేషగిరి, ఉద్యోగ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.