13న జరిగే లోక్ ఆదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలి – ఎస్పీ మలిక గర్గ్

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

వార్షిక తనిఖీల్లో భాగంగా కొండేపి సర్కిల్ లోని మర్రిపూడి పోలీస్ స్టేషన్ ను గురువారం నాడు ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ సందర్శించారు.

తొలిత స్టేషన్‌ ఆవరణాన్ని మరియు స్టేషన్ లోని రిసెప్షన్‌, లాకప్‌, కంప్యూటర్ గది, రైటర్ రూంలను పరిశీలించారు.

మర్రిపూడి పోలీసు స్టేషన్లలో నమోదుకాబడిన మర్డర్, దొంగతనాలు, క్రైమ్ ఎగైనెస్ట్ వుమన్, ఐటీ కేసులు మరియు ఇతర గ్రేవ్/నాన్ గ్రేవ్ కేసుల కంపారిటివ్ స్టేట్మెంట్ ను పరిశీలించి అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసుల సిడి ఫైల్స్ ను, పెండింగ్ ట్రయల్లో ఉన్న సిడి ఫైళ్లను, అలాగే స్టేషన్ లో నిర్వహిస్తున్న జనరల్ డైరీ, డ్యూటీ రోస్టర్, విలేజ్ రోస్టర్, ప్రాసెస్ రిజిస్టర్ తదితర రికార్డ్స్ ను క్షుణంగా పరిశీలించారు.స్టేషన్లో నిర్వహించే అన్ని రికార్డ్స్ సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.

పెండింగ్ కేసులు, గ్రేవ్ కేసుల్లో దర్యాప్తు తీరుతెన్నులు, పురోగతిపై పోలీసు అధికారుల వివరణ తీసుకొని సదరు కేసుల ఛేదింపునకు దోహదపడే దర్యాప్తు విధానాలపై పోలీసులకు ఎస్పీ గారు దిశానిర్దేశం చేసారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పూర్తిచేయాలని, ప్రతి కేసులో క్వాలిటీ ఇంస్టిగేషన్ ఉండాలని, గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా కేసులలో శిక్షల శాతం పెంచాలని సూచించారు.

స్టేషన్ పరిధిలో నేర, శాంతి భద్రతల స్థితిగతులు మరియు అసాంఘిక కార్యకలాపాల గురించి అధికారులను ఆరా తీశారు. దొంగతనాల కేసుల్లో ప్రాపర్టీ రికవరీ శాతం పెంచాలని, మహిళలు, చిన్న పిల్లలపై జరిగే నేరాలు కట్టడి, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహనా కల్పించాలని, పాత కొత్త నేరస్థుల పై నిఘా ఉంచాలని, అధికారులు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించి క్రైమ్ రేటు తగ్గించాలని, 13 న జరగబోయే లోక్ అదాలత్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చెయ్యాలని సూచించారు.

అనంతరం ఎస్పీ గారు మహిళా పోలీసులతో సమావేశమై వారిని గ్రామాల్లో కొత్త వ్యక్తుల వివరాలు సేకరించాలని, ప్రైవేట్ సీసీటీవీ కెమెరాల పనితీరు తరచూ పరిశీలించాలని, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, పోలీస్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్లు లేని ఆటోలను గుర్తించాలని, ప్రజలకు, సైబర్ మోసాలు /జాబ్ మోసాలపై, పోక్సో చట్టాలపై, యువతకు ఈవ్ టీజింగ్ పై అవగాహన కల్పించాలని, గ్రామాలలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే గొడవలు, బాల్య వివాహాలు, అసాంఘీక కార్యకలాపాలు మరియు ఇతర అంశాలపై సమాచారమును ఎప్పటికప్పుడు పై అధికారులకు తెలియపర్చాలని సూచించారు.

పోలీసు స్టేషన్ల లోని సిబ్బందితో మాట్లాడి వారి పని తీరు, వారు ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. విధినిర్వహణ సమర్థవంతంగా చేయాలని, వృత్తి నైపుణ్యం పెంచుకోవాలని, ఫిర్యాదుదారులు బాధితుల పట్ల మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ లను ఆశ్రయించే బాధితులకు అండగా నిలవాలని, అధికారులు సిబ్బంది క్రమశిక్షణ, వృత్తిపట్ల నిబద్ధత, నిజాయితీ, పారదర్శకత కలిగి ఉండాలని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి ఉన్నత సేవలు అందిస్తూ వారి మన్ననలు పొందాలని సూచించారు.

ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి సిబ్బంది అందరూ స్టేషన్ పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా, పచ్చదనంగా, ఆహ్లాదకరంగా ఉంచుకోవాలని సూచించారు.

వేసవిలో దాహార్తుల దాహం తీర్చుటకు చలివేంద్రాలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ మలిక గర్గ్

అనంతరం జిల్లా ఎస్పీ గారు పాదచారులు, ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు, మండల ప్రజలు దాహార్తిని తీర్చే ఉద్దేశంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో మర్రిపూడి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ప్రారంభించి, దాహార్తులకు, చిన్న పిల్లలకు మజ్జిగ, చల్లని నీరు స్వయంగా అందించారు.

ఎస్పీ గారు వెంట ట్రైనీ ఐపీఎస్ అంకిత సురాన, కనిగిరి డిఎస్పీ ఆర్ రామరాజు, డియస్బి డిఎస్పీ బి మరియదాసు, కొండేపి సీఐ వై పాండురంగారావు మర్రిపూడి ఎస్సై పి అంకమ్మరావు, కొండేపి ఎస్సై రమణయ్య, పొన్నలూరు ఎస్సై రాజారావు, ఎస్పీ సిసి నారాయణ మరియు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.