గొర్రెలను ఢీకొన్న కారు…..14 గొర్రెలు మృతి
కారు ఢీకొని 14 గొర్రెలు మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే గోగినేని పాలెం గ్రామానికి చెందిన గోగినేని వెంకటేశ్వర్లు, కొండ్రగడ్డ బ్రహ్మయ్యలు తమ మేపుకుని అనంతరం ఇంటికి వెళ్ళే క్రమంలో ఒంగోలు వైపు వెళుతున్న కారు వేగంగా గొర్రెలపైకి దూసుకురావడంతో 14 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. గొర్రెలను ఢీకొన్న కారు వేగంగా వెళ్ళిపోవడంతో విషయం తెలుసుకున్న పొదిలి యస్ఐ శ్రీరామ్ చీమకుర్తి , సంతనూతలపాడు పోలీసులను అప్రమత్తం చేసి సంఘటనా స్ధలానికి చేరుకుని మృతిచెందిన గొర్రెలను పరిశీలించారు. గొర్రెలను ఢీకొట్టిన కారు సంతనూతలపాడు సమీపంలో ఆపి డ్రైవర్ పరారైనట్లు సంతనూతలపాడు పోలీసులు గుర్తించారు.