15వ తేదీన తెదేపా విస్తృత సమావేశం
పొదిలి మండల తెలుగు దేశం పార్టీ విస్తృత సమావేశం నవంబర్ 15వ తేది గురువారం ఉదయం 11 గంటలకు స్థానిక సాయి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, దివి శివరాం, పార్టీ పరిశీలకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, దుగ్గళి నాగేంద్ర, తదితరులు పాల్గొంటారని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు నుండి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయని గ్రామాల వారిగా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలతో సమీక్ష సమావేశం జరుగుతుందని పార్టీ నాయకులు తెలియజేశారు.