17న డి ఎం హెచ్ పి ఆధ్వర్యంలో ఉచిత మానసిక వైద్యశిబిరం
జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం మంగళవారంనాడు నిర్వహిస్తున్నట్లు కార్యక్రమం అధికారి -జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం అధికారులు డాక్టర్ చక్రవర్తి, సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు.
పొదిలి ప్రభుత్వ సామాజిక వైద్యశాల నందు నిర్వహించే ఈ కార్యక్రమంలో నిద్రలేమి, డిప్రెషన్, భార్యాభర్తల మధ్య అనుమానం, మద్యం మొదలైనటువంటి వ్యసనాలకు బానిసలుగా మారడం, టెన్షన్, భయం, ఆందోళన, అతి శుభ్రత, చిన్నతనం ముసలితనంలో వచ్చే సమస్యలు, సెక్స్ సంబంధిత సమస్యలు, చదువులో వెనుకబడడం వంటి సమస్యలకు డాక్టర్ అఖిలేష్ (మానసిక వైద్యులు), డాక్టర్ ఏడుకొండలు (సైకాలజిస్ట్) పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు.