17న భూ సమస్యల పరిష్కారానికి ఎంఎల్ఏ ఆద్వర్యంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం…..
పొదిలి మండలం పరిధిలోని అన్ని రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన భూ వివాదాలు, భూ సమస్యల పరిష్కారం కొరకు తేది 17వ తేది మంగళవారం ఉదయం స్ధానిక మండల రెవిన్యూ తహశీల్దార్ కార్యాలయంలో ఉదయం 9గంటలకు మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పొదిలి మండల రెవెన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కావున మండలంలో భూ సమస్యలు భూ వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని రైతులు వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.