18న పొదిలిలో నివేశన స్ధలాల గ్రామసభ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఉగాది నాటికి ఇల్లులేని ప్రతి నిరుపేదకు నివేశన స్ధలాలు మంజూరు చెయ్యాలని తలపెట్టిన కార్యక్రమంలో భాగంగా 18వతేది శుక్రవారం నాడు నివేశన స్ధలాల గ్రామసభ స్ధానిక పొదిలి పంచాయతీ కార్యలయంలో ఉదయం 10గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుందని…..

ఈ సభలో ఇంటి స్ధలాలు మంజూరు చేయడంకోసం సిద్ధం చేసిన జాబితాలో అర్హలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపవచ్చునని అదేవిధంగా అర్హత కలిగివుండి జాబితాలో పేరు లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చునని మండల రెవెన్యూ తహశీల్దార్ జి ప్రభాకరరావు ఒక ప్రకటనలో తెలిపారు.