2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలి

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

డీఎస్సీ 2003లో ఉద్యోగాలు సాధించిన వారికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్సీ నెంబర్ 57 ప్రకారం ఓ పి ఎస్ అమలు చేయాలని 2003 కన్వీనర్ ఎం. శివశంకర్ రావు అన్నారు .

పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం ఆ ఫోరం జిల్లా సమావేశం జరిగింది .

ఈ సందర్భంగా కన్వీనర్ ఎం. శివశంకర్ రావు మాట్లాడుతూ  తమకు న్యాయం చేయాలని 20 ఏళ్లుగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నట్టు చెప్పారు . కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఆర్ సి నెంబర్ 57 ప్రకారం ఓ పి ఎస్ వర్తింప చేశారన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 9,000 మంది ఓపిఎస్ కోసం చూస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర నాయకులు గురుబ్రహ్మం మాట్లాడుతూ తమ న్యాయపరమైన సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

న్యాయమైన హక్కుల కోసం పోరాడేందుకు ఐక్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు . పలువురు నాయకులు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎలాంటి కార్యాచరణ అవసర మో చర్చించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నయీమ్, జిల్లా నాయకులు మాల కొండయ్య , ఏడుకొండలు, జూపల్లి వెంకటేశ్వర్లు , సురేష్ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులు హాజరయ్యారు.