2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టం పరిహారం చెల్లించాలని సమీక్ష సమావేశంలో రైతులు డిమాండ్

పర్యావరణ పరిరక్షణ శిక్షణ మరియు పరిశోధన సంస్థ (ఇపిటిఆర్ఐ) గచ్చీబోలి హైదరాబాద్ వారు ఆద్వర్యం లో పొదిలి మండల రెవెన్యూ తహిశీల్దార్ కార్యలయం నందు మంగళవారం ఉదయం తహాశీల్దార్ అద్యక్షతనతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంస్థ అధికారి గోపికృష్ణ మాట్లాడుతూ సెటిళ్ మెంట్ భూముల కు రోడ్డు వెంట ఉన్న భూముల కు 15.72 లక్షలు రోడ్డు కు లోపల ప్రక్క ఉన్న భూముల కు 7.86 లక్షల రూపాయలు ప్రతిపాదించిన్నట్లుగా రైతులు కు తెలిపారు. పొదిలి తహాశీల్దార్ విద్యాసాగరడు మాట్లాడుతూ అసైన్ మెంట్ భూముల కు ధర పై ప్రభుత్వం  నిర్ణయం తీసుకోలేదుని అయిన అన్నరు.రైతులు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టం పరిహారం చెల్లించాలని  వినతి పత్రలు  అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు రైతులు తదితరులు పల్లొన్నరు.