20వ తేది నుండి కబడ్డీ పోటీలు

20వతేదీ నుండి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు జరుగునున్నాయని నిర్వాహకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి తెలిపారు.

వివరాల్లోకి వెళితే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి పర్యవేక్షణలో పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి, దరిశి మండలాల స్థాయి కబడ్డీ పోటీలు జరుగునున్నాయని….. మొదటి బహుమతి – 15116, ( ప్రజా వైద్యులు యర్రం వెంకట రెడ్డి)……. రెండవ బహుమతి – 10116( వాకా వెంకటరెడ్డి )…… మూడవ బహుమతి – 5116 (గొలమారి చెన్నారెడ్డి)……. మెమోంటోలు సాయి రాజేశ్వరరావు, మెడల్స్ మల్లెల యేబుల సౌజన్యంతో పోటీలు నిర్వహిస్తున్నామని

పోటీలో పాల్గొనేవారు ఆధార్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలని అలాగే 400వందల రూపాయలు ఎంట్రీ ఫీజు 19వతేది సాయంత్రం లోపు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని పూర్తి వివరాలకు నేరుగా సంప్రదించాలని నిర్వాహకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.