రోడ్డు ప్రమాదంలో 23 గొర్రెలు మృతి
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
పొదిలి మండలం కుంచేపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం లో 23 గొర్రెలు మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది.
వెలిగండ్ల మండలం గణేషుని పల్లి గ్రామానికి చెందిన బాల గురవయ్య తన గొర్రెల మందతో వెళ్తున్న సమయంలో ఆదివారం రాత్రి పొదిలి మండలం కుంచేపల్లి గ్రామ సమీపంలో దరిశి వైపు నుంచి వస్తున్న కారు గొర్రెల మందపై దూసుకొని పోవటంతో 23 గొర్రెలు మృతి చెందగా మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డయని సుమారు వాటి విలువ ఐదు లక్షల రూపాయలు విలువ ఉంటుందని గొర్రెల యాజమాని తెలిపారు.
గొర్రెల యజమాని ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు