ఘనంగా లూయిస్ డాగురే జయంతి వేడుకలు
కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురె జయంతి వేడుకలను పొదిలి కొనకనమీట్ల మర్రిపూడి మండలాల ఫోటోగ్రాఫర్స్ & వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివరాలు లోకి వెళితే సోమవారం నాడు లూయిస్ డాగరే 232 జయంతి పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వం వైద్యశాల నందు రోగులకు స్థానిక భవిత పాఠశాల నందు విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసారు. అనంతరం స్థానిక విశ్వనాథపురం నందు ఏర్పాటు చేసిన కేక్ను కోసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కల్లం వెంకట సుబ్బారెడ్డి గొలమారి చెన్నారెడ్డి వాకా వెంకటరెడ్డి జి శ్రీనివాసులు ప్రభుత్వం వైద్యులు షేక్ రఫీ పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు