మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 23 తేదీ సోమవారం నాడు పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు స్పందన కార్యక్రమం జరుగుతుందని మండల రెవెన్యూ తహశీల్దారు మహమ్మద్ రఫీ గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు.
కావున పొదిలి మండల పరిధిలోని గ్రామాల్లో చెందిన ప్రజలు వారికి గల సమస్యలను మరియు విన్నపాలను అర్జీ రూపం లో శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డికి దాఖల చేసుకోవాలని ఒక ప్రకటన లో తెలిపారు.