కోజికోడ్ కళాశాల విద్యార్థిసంఘం ఎన్నికల ప్రచారంలో పాక్ జాతీయ పతాకం ఊపిన 25మందిపై కేసు నమోదు

కేరళ రాష్ట్రం కోజికోడ్ లోని పెరంబ్రా సిల్వర్ కళాశాలలో పాకిస్థాన్ జాతీయ పతాకం ఊపిన 25మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే శనివారంనాడు కళాశాల విద్యార్థి సంఘం ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం కేరళ విద్యార్థి సంఘం (కె యస్ యు ), ముస్లిం విద్యార్థి ఫ్రంట్ (ఎం యస్ యఫ్ ), సంయుక్త కూటమిగా ఏర్పడి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో పాకిస్థాన్ జాతీయ పతాకం పట్టుకుని ఊపడానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన పోలీసులు 25విద్యార్థులను గుర్తించి వారిపై ఐపిసి సెక్షన్లు 143, 147, 153, 149 క్రింద కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ముస్లిం విద్యార్థి ఫ్రంట్ నాయకులు మాట్లాడుతూ మా విద్యార్థి సంఘం జెండా తయారీలో పొరపాటు జరిగిందని ఉద్దేశ్య పూర్వకంగా చేయలేదని తెలిపారు.

అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ఎన్నికల ప్రచారంలో జాతీయ జెండా పట్టుకుని ప్రచారం చేయడం వలనే వారు పాకిస్థాన్ పతాకం పట్టుకుని ప్రచారం చేశారని వామపక్ష విద్యార్థి సంఘ నాయకులు ఆరోపించారు

విద్యా సంస్థలోకి తీవ్రవాదులు ప్రవేశించారని తక్షణమే వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.