మాండూస్ ప్రభావంతో 2500 ఎకరాల పంట నష్టం
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పొదిలి మండలంలో 2500 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారి షేక్ జైనులాబ్దిన్ ఒక ప్రకటన విడుదల చేశారు.
మాండూస్ తూఫాన్ ప్రభావం ప్రాంతాల్లో పర్యటించిన మండల వ్యవసాయ అధికారి షేక్ జైనులాబ్దిన్ ప్రాథమిక అంచనా ప్రకారం 950 హెక్టార్లు ల్లో పంట నష్టం వాటిల్లిందని సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి నివేదికను సమర్పించామని ముఖ్య గా ముదురు బొబ్బర్లు కామలు పగిలి మొక్కలు రావటాన్ని గుర్తించామని అదే విధంగా పొలాల్లో నీరు నిలిచిందని రైతులకు మినుములు పెసలు శనగలు బొబ్బర్లు వరి కంది పంటలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పిచాకారి చేయాల్సిన మందు మోతాదు గురించి రైతులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు
పలువురు రైతులు మాట్లాడుతూ తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నష్టం పోయిన పంటకు నష్టం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు