తెలంగాణకు చెందిన 260మద్యం బాటిళ్లు పట్టివేత… ఇద్దరు అరెస్టు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన 260మద్యం బాటిళ్లను అక్రమంగా రవాణా చేసి నిల్వఉంచి అక్రమ విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిని ఎక్సైజ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే తాళ్లూరు మండల పరిధిలోని తూర్పు గంగవరం గ్రామంలో అక్రమంగా తెలంగాణ నిండి మద్యం తీసుకుని వచ్చి విక్రయాలకు పాల్పసుతున్నారనే పక్కా సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు బుధవారంనాడు దాడులు నిర్వహించి 260మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి అవులయ్య తెలిపారు.
కృష్ణాజిల్లాలోని ఆంధ్రా తెలంగాణ సరిహద్దు నుండి గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా కొనుగోలు చేసిన 8కేసుల మద్యాన్ని పశువుల దాణా వాహనంలో దాణా రవాణా చేస్తున్నట్లుగా దాణాలో దాచిఉంచి తీసుకుని వచ్చి తూర్పుగంగవరంలో విక్రయాలకు పాల్పడినట్లు ప్రాధమిక దర్యాప్తులో తేలిందని….. ఎవరి దగ్గర కొనుగోలు చేశారు ఎంతమందికి విక్రయించారు అనే దానిపై విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిఐ వెంకట్రావు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.