రెడ్ జోన్ పరిధిలో 28లాక్ డౌన్ – తహశీల్దార్ ప్రభాకరరావు

తూర్పుపాలెం కోవిడ్ కేసు రెడ్ జోన్ పరిధిలో 28రోజులు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ అమలు జరుగుతుందని పొదిలి రెవెన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు తెలిపారు.

సోమవారంనాడు తహశీల్దార్ ప్రభాకరరావును కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ రెడ్ కంటోన్మెంట్ జోన్ల పరిధిలోని ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించి కోవిడ్ వ్యాప్తి నిరోధానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదేవిధంగా మండలంలోని ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం పాటిస్తూ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తూ కోవిడ్ వ్యాప్తికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.