28తేదీన జరగబోయే ఎఐటియుసి జిల్లా మహాసభను జయప్రదం చేయండి : జిల్లా కార్యదర్శి బాలిరెడ్డి

ఈనెల 28వ తేదీన ఎఐటియుసి జిల్లా పదవ మహాసభలు కందుకూరు లో జరుగుతున్నట్లు ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బాలిరెడ్డి తెలిపారు . స్దానిక ఎన్ఎపి వాటర్ షెడ్ నందు బుధవారం ఎఐటియుసి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కందుకూరులో ఆదివారం సాయంత్రం మూడు గంటలకు కామ్రేడ్ చౌడారెడ్డి స్ధూపం వద్ద నుండి బయలుదేరి పాతబస్టాండ్ సెంటర్ అంబేద్కర్ బొమ్మ వద్దకు చేరుకున్న అనంతరం ఐదుగంటలకు బహిరంగ సభ జరుతుందని ఈ బహిరంగ సభకు ఎఐటియుసి జిల్లా మహాసభలకు ఎఐటియుసి రాష్టకార్యదర్శి జి ఓబులేసు, మాజీ యమ్ యల్ సి పిజె చంద్రశేఖర్ రావు, ఎఐటియుసి రాష్ట్ర ఉపప్రధానకార్యదర్శి ఆర్ రవీంద్రనాధ్, రాష్టకార్యదర్శి వి రాధాఈమూర్తి, జిల్లా కార్యదర్శి ఎంయల్ నారాయణ, జిల్లా అధ్యక్షులు యస్ డి సర్దార్, జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఆర్ చౌదరి, సీనియర్ నాయకులు రాఘవులుతో పాటు పలువురు నాయకులు పాల్గొంటారని కావున పొదిలి, మర్రిపూడి, కొనకనమిట్ల మండలాల నుండి ప్రజలు భారీగా హాజరై సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా నాయకులు ఆర్ డబ్ల్యూఎన్ఎపి పొదిలి డివిజన్ కార్యదర్శి దేవయ్య, సిరారుద్దీన్, వెంకటనారాయణ, నాసరయ్య, రియాజ్, ఖరిముల్లా తదితరులు పాల్గొన్నారు.