28న గ్రామ పంచాయతీ టెండర్లకు ఆహ్వానం
పొదిలి గ్రామపంచాయతీ నందు 7విభాగాలకు సంబంధించి 28వ తేదీ శనివారంనాడు టెండర్లను పిలిచామని పొదిలి గ్రామ పంచాయతీ కార్యదర్శి నక్కా బ్రహ్మనాయుడు తెలిపారు.
వివరాల్లోకి వెళితే గురువారంనాడు స్ధానిక పంచాయతీ కార్యాలయంలో ఆయనను కలిసిన పొదిలిటైమ్స్ ప్రతినిధితో గ్రామ పంచాయతీ కార్యదర్శి బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పారిశుద్ధ్య పనులు చేయటకు 50మంది, 50మంది డ్రైన్ క్లీనర్లు, బుగ్గచలం నీరు వదులుటకు ఇద్దరు టర్నుకాక్ లు మరియు సాగర్ నీరు వదులుటకు మరో ఇద్దరు టర్న్ కాక్ లు, వీధి దీపాలు మరమత్తులు చేయుటకు ఇద్దరు ఎలక్ట్రిషియన్ లు, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ నడుపుటకు ముగ్గురు డ్రైవర్లు, కార్యాలయం సహాయకులుగా పని చేయుటకు ఇద్దరు…..
మొత్తం 111మందిని 2019-20 సంవత్సరానికి కాంట్రాక్టు పద్దతిలో టెండర్లకు ఆహ్వానించామని…. టెండర్లలో పాల్గొన్నవారు చెల్లించవలసిన ధర 4వేల రూపాయలు టెండర్ ధరావత్తు 100రూపాయలు చెల్లించి రసీదు పొంది పాల్గొనవచ్చునని…. ఉదయం 10గంటల నుండి మద్యహ్నం 2గంటల వరకు సీల్డు టెండర్లు తీసుకుని మధ్యాహ్నం 3.30నిమిషాలకు టెండర్లలో పాల్గొన్న వారి సమక్షంలో ఓపెన్ చేస్తామని….
సంబంధిత పూర్తి వివరాల గురించి కార్యాలయ పనివేళలలో సంప్రదించవచ్చునని ఆయన తెలిపారు.