నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో 2 కె రన్

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఫ్రీడం 2 కె రన్ నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు స్థానిక శివాలయం నుంచి 2 కె రన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ సొంగా కొండలరావు మాట్లాడుతూ ఆరోగ్యం తోనే మెరుగైన సమాజం నిర్మించుకోవాలని అత్యధిక యువత గల దేశం భారతదేశమని ముఖ్యంగా యువత ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆరోగ్యవంతమైన దేశాన్ని నిర్మించుకోవటంమే మన లక్ష్యమని అన్నారు.

ఈ కార్యక్రమంలో రావూరు సత్యాలు వెన్నెల శ్రీనివాస్ మాదాల సుబ్బారావు మరియు పట్టణ యువత తదితరులు పాల్గొన్నారు.