పొదిలి నగర పంచాయతీ నుండి 3పంచాయతీలను తొలగించాలని హైకోర్టులో 3రిట్ పిటిషన్లు దాఖలు

* నేడు విచారణ చేపట్టిన కోర్టు మార్చి 3తేదికి కేసు వాయిదా

* పొదిలి నగర పంచాయతీకి ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠత

* వార్డుల హద్దులు ఏర్పాటు ప్రక్రియ పూర్తి

* వార్డుల వారీగా ఓటర్ లిస్టు తయారులో నిమగ్నమైన అధికారులు

* మార్చి 3లోగా నోటిఫికేషన్ విడుదల చేస్తే ఎన్నికలు జరిగే అవకాశం

పొదిలి నగర పంచాయతీ నుండి కంభాలపాడు, నందిపాలెం, మాదాలవారిపాలెం గ్రామ పంచాయతీలను తొలగించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు 3రిట్ పిటిషన్లు దాఖలు కాగా నేడు విచారణ చేపట్టిన కోర్టు మార్చి 3వ తేదికి కేసు వాయిదా వేసింది.

వివరాల్లోకి వెళితే పొదిలి నగర పంచాయతీ నుండి కంభాలపాడు, నందిపాలెం, మాదాలవారిపాలెం గ్రామ పంచాయతీలను తొలగించాలని కోరుతూ హైకోర్టు నందు కంభాలపాడు గ్రామం నుండి ఆవులూరి కోటప్ప నాయుడు, సలగాలి రామయ్య, జువ్వాజీ వెంకటేశ్వర్లు…… నందిపాలెం గ్రామం నుండి
సన్నేబోయిన చిన్న బాలయ్య, గజ్జా రామ నారసయ్య, బరిగే సుబ్బారావు……. మాదాలవారిపాలెం గ్రామం నుంచి మీగడ ఓబుల రెడ్డి, దామిరెడ్డి రామాంజనేయ రెడ్డిలు ఫిబ్రవరి 1వతేదీన మూడు గ్రామాల నుండి వేరువేరు రిట్ పిటిషన్లు దాఖలు చేయగా గురువారంనాడు అరూప్ కుమార్ గోస్వామి, సి ప్రవీణ్ కుమార్ ధర్మాసనం ముందు విచారణ జరిపి తదుపరి విచారణను మార్చి 3తేదీకి వాయిదా వేశారు.

త్వరలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు పొదిలి నగర పంచాయతీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉందా లేదా అనే అంశంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

పొదిలి నగర పంచాయతీ పరిధిలో 20వార్డుల హద్దులు ఏర్పాటు ప్రక్రియ పూర్తి కాగా సంబంధించిన ఓటర్లు జాబితా తయారీలో నగర పంచాయతీ అధికారులు సన్నాహాలు చేస్తూ….. నెలాఖరులోగా ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ప్రక్రియతో సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేందుకు నగర పంచాయతీ అధికారులు సిద్ధమయ్యారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మార్చి 3తేదీలోగా మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయితే పొదిలి నగర పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనాలు ఉండగా……..

హైకోర్టు కోర్టు నందు కేసు విచారణ జరిగే సమయంలో నగర పంచాయతీకి ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవచ్చునని న్యాయవాద వర్గాల భోగట్టా.

ఏది ఏమైనా పొదిలి నగర పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా లేదా అనే విషయంపై స్పష్టత రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.