రేపు తహశీల్దార్ నూతన భవనం ప్రారంభం : తహశీల్దార్ ప్రభాకరరావు
పొదిలి మండలం రెవెన్యూ తహశీల్దార్ నూతన భవనం శుక్రవారంనాడు సాయంత్రం ప్రారంభం జరగనున్నట్లు పొదిలి మండల రెవెన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు గురువారం ఆయనను కలిసిన పొదిలిటైమ్స్ ప్రతినిధితో తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనువాసులరెడ్డి, మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, కందుకూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఓబులేసు మరియు వివిధ స్ధాయి అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు.