నిరాడంబరంగా బిజెపి వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు
భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.
వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్ధానిక పెద్ద బస్టాండ్ వద్ద భారతీయ జనతా పార్టీ 40వ వార్షికోత్సవం వేడుకల్లో తొలిత పార్టీ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్ లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకులు మువ్వల సుబ్బయ్య మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బిజెపి అన్ని రాష్ట్రాల్లో బలీయమైన శక్తిగా ఎదిగింది ఆంధ్రప్రదేశ్ లో కూడా రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగాలని అన్నారు
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల పార్టీ కన్వీనర్ మాకినేని అమర్ సింహా , స్ధానిక నాయకులు మువ్వల పార్ధసారధి, మాగులూరి రామయ్యా, శ్రీనివాసులురెడ్డి, రావూరి సత్యనారాయణరావు,మద్దాళి కేశవరావు తదితరులు పాల్గొన్నారు