ఎంఎల్ఏ స్పందన కార్యక్రమానికి 46 దరఖాస్తులు

శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 46 అర్జీ స్వీకరించారు.

సోమవారం నాడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు తహశీల్దారు షేక్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి కి పెన్షన్ సమస్య, పొదిలి నగర పంచాయితీ పరిధిలో పని చేసే వాలెంటర్ల్లుకు జీతాలు చెల్లింపులు, పట్టాదారు పాస్ బుక్ మంజూరు, భూమి సర్వే, సాగర్ నీటి సరఫరా కోసం పైప్ లైన్లు, మురుగు కాల్వలు మొదలైన సమస్యలపై అర్జీలు స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్,మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీకృష్ణ, ఈఓఆర్డీ రాజశేఖర్, మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు, వెలుగు ఎంపియం మాణిక్య రావు, ఉపాధి హామీ పథకం ఎపియం బుల్లెనరావు, పొదిలి యస్ఐ శ్రీహరి, పంచాయతీ రాజ్ ఎఇ మస్తాన్ వలి, రక్షిత మంచినీటి సరఫరా ప్రాజెక్టు ఎఇ శ్రీకాంత్, వివిధ శాఖల అధికారులు
పాల్గొన్నారు