ప్రపంచ వ్యాప్తంగా 48 గంటల్లో ఇంటర్నెట్ బంద్

రానున్న 48 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ ఆగిపోనుంది. వివరాల్లోకి వెళితే రష్యాటుడే అనే న్యూస్ ఛానల్ లో వెల్లడించిన వివరాల ప్రకారం సర్వర్ల సాధారణ నిర్వహణలో భాగంగా రానున్న 48గంటలలో డొమైన్ లు ఏమి పనిచేయవని, మెయిన్ డొమైన్ సర్వర్లు వాటికి సంబంధించిన నెట్వర్క్ లు కొద్దీ సమయం పనిచేయవని దీని కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సదుపాయం ఆగిపోనున్నట్లు తెలిపింది. ఇటీవల జరుగుతున్న సైబర్ దాడులను తిప్పికొట్టేందుకు ది ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ఐ సి ఏ ఎన్ ఎన్) సర్వర్ల మెయింటేనెన్స్ ఈ వర్క్ ను చేపడుతుంది. రానున్న 48గంటల్లో కొద్దిసేపు ఇంటర్నెట్ క్లోజ్ చేసి క్రిప్టోగ్రాఫిక్ కీ ని మార్చడం ద్వారా ఇంటర్నెట్ అడ్రెస్ బుక్ (డొమైన్ నేమ్ సిస్టమ్) ను భద్రపరచవచ్చునని దీని ద్వారా సైబర్ దాడులను తిప్పికొట్టడానికి(ఐ సి ఏ ఎన్ ఎన్) ఈ మార్పును చేస్తుందని కమ్యూనికేషన్ రెగ్యులేటరీ అథారిటీ (సీఆర్ఏ) ప్రకటనను విడుదల చేసింది……….. కాకపోతే కొంతసేపు అని స్పష్టం చేసింది కానీ ఎంతసేపు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయని (సీఆర్ఏ) స్పష్టంగా తెలుపలేదు.