ఐదోరోజుకు చేరిన రిలేదీక్షలు వడదెబ్బ తగిలిన దీక్ష కొనసాగింపు

పొదిలి గ్రామ పంచాయతీ వద్ద తలపెట్టిన రిలే దీక్షలు ఐదో రోజుకు చేరింది దీక్ష లో కామునూరి నరసింహరావు షేక్ రసూల్ షేక్ యాసిన్ షేక్ షబ్బీర్ రాము ముల్లా ఖూద్దుస్ లో కూర్చున్నరు దీక్ష కొనసాగుతున్న సందర్భంగా వడదెబ్బ తగిలి సొమ్మచెల్లిన రాము వైద్య చికిత్సను దీక్ష శిబిరం లోనే తీసుకొని దీక్ష కొనసాగించారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ 2016-17 సంవత్సరం గాను నీటి ట్యాంకర్ల యాజమానులుకు చెల్లించవలసిన 33 లక్షల రూపాయలు సర్పంచ్ డ్రా చేసుకొని మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందిని మాకు రావలసిన డబ్బులు చెల్లించే వరకు దీక్ష కొనసాగుతుందని అధికారులు నుండి స్వందన రాకపోతే ఆమరణ దీక్ష దిగుతానని అయిన అన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కాటూరి వెంకట నారాయణ బాబు మాజీ అధ్యక్షులు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి పట్టణ అధ్యక్షులు షేక్ జిలానీ తదితరులు పాల్గొన్నారు